|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 11:58 AM
బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందన్న వార్తలను మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. అది కేవలం దుష్ప్రచారం అని స్పష్టం చేశారు. గువ్వల బాలరాజు పార్టీకి దూరమవడం ఆయన వ్యక్తిగత నిర్ణయమని, దీనిపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.