|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 11:41 AM
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ఓ ప్రైవేట్ ఆసుపత్రి అనుమతులు రద్దు చేస్తున్నట్లు సంబంధిత యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినట్లు డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్. విద్యా బుధవారం తెలిపారు. ఇటీవల ఓ బాలుడు మృతి చెందడంతో ఆరోగ్య శాఖ విచారణ చేపట్టి, బాధ్యతా రహితంగా వ్యవహరించినందుకు 3రోజుల్లో ఆసుపత్రి మూసివేయాలని నోటీసులో పేర్కొన్నట్లు వెల్లడించారు.