|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 11:38 AM
సెల్ఫీ మోజులో ఉన్న ఓ యువకుడు నాగార్జునసాగర్ కొత్త బ్రిడ్జిపై నుంచి నదిలో పడ్డాడు. ఈ ఘటన సోమవారం రాత్రి ప్రాంతంలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలానికి చెందిన నలుగురు యువకులు నాగార్జునసాగర్‌ను చూసేందుకు వచ్చారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న మంతాని శివ(24) బ్రిడ్జిపైకి ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. స్థానికులు వారిస్తున్నా లెక్కచేయకుండా బ్రిడ్జి గోడమీదకు ఎక్కి సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. గాలింపు చర్యలు చేపట్టారు.