|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 01:43 PM
పిల్లల ఆరోగ్యంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని షాద్ నగర్ డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి సూచించారు. పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత, శారీరక, మానసిక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆమె తెలిపారు. ఆరోగ్య సమాజం కోసం అనేక చర్యలు చేపట్టినా, కొందరు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, అలాంటి వారికి వైద్యారోగ్య శాఖ సూచనలు, సలహాలు అందిస్తుందని పేర్కొన్నారు.