|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 12:58 PM
TG: హనుమకొండ రామ్‌నగర్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు ఇవ్వొద్దని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు మంత్రి ఇంటిని ముట్టడించారు. వెంటనే 8 నెలల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో కార్మికులు మంత్రి ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేయగా సుబేదారి పోలీసులు వారిని అడ్డుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.