|
|
by Suryaa Desk | Sat, Aug 09, 2025, 12:48 PM
పటాన్చెరు : సోదరి సోదరుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సంబరాలు గూడెం వారి ఇంట వెళ్లి విరిశాయి.రాఖీ పండుగ పురస్కరించుకొని శనివారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నివాసానికి చేరుకున్న వారి సోదరీమణులు నర్సమ్మ, సువర్ణలు ఎమ్మెల్యే జిఎంఆర్ తో పాటు మరో సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిలకు రాఖీలు కట్టి తమ అనుబంధాన్ని చాటుకున్నారు. వీరితోపాటు గూడెం మహిపాల్ రెడ్డి కుమార్తె కొలన్ రాజేశ్వరి రెడ్డి తమ సోదరుడు గూడెం విక్రం రెడ్డికి రాఖీ కట్టారు. కీర్తిశేషులు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి కుమార్తె రుధిర, గూడెం విక్రం రెడ్డి కుమార్తె మహిరలు వారి సోదరులు అక్షయ్ రెడ్డి, నిహాన్ రెడ్డి లకు రాఖీలు కట్టారు. కుటుంబమంతా రాఖీ పండుగ సంబరాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ అక్కా చెల్లెలు, అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాల సూచికగా నిర్వహించుకుని గొప్ప పండుగ రాఖీ అని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.