|
|
by Suryaa Desk | Sat, Aug 09, 2025, 11:48 AM
గజ్వేల్ మండలం కొడకండ్ల రాజీవ్ రహదారిపై రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టడంతో బందేల లక్ష్మయ్య (58) అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అతడిని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతిని నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.