|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 03:20 PM
TG: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును BRS నేత హరీశ్‌రావు ఖండించారు. 'ఇందిరమ్మ రాజ్యం అని గొప్పలు చెప్పుకొంటూ మహిళా సభ్యురాలి పట్ల కర్కశంగా వ్యవహరించడం సిగ్గుచేటు. మంత్రి సమక్షంలోనే కాంగ్రెస్ నాయకులు వీధి రౌడీలుగా బెదిరింపులకు పాల్పడుతుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు.. వారితో కలిసి మహిళా ఎమ్మెల్యేపై దౌర్జన్యానికి పాల్పడటం దుర్మార్గం. పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలి' అని డిమాండ్ చేశారు