|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 03:19 PM
ఆధార్ కార్డు అప్డేట్ చేయలేదన్న కారణంతో ఫ్రీ టికెట్ ఇవ్వనన్న కండక్టర్‌పై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భైంసా నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు దేగామ్ వద్ద అరగంట పాటు ఆపి వారు గొడవకు దిగారు. ఆధార్ కార్డులో ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరు ఉండడంతో టికెట్ ఇవ్వనని కండక్టర్ చెప్పడంతో ఈ వివాదం చోటు చేసుకుంది.