|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 02:13 PM
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం రాజుల్లా గ్రామంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నూతన రేషన్ కార్డు దారులు, కల్యాణ్ పథకం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. పేదలకు రేషన్ కార్డు గుర్తింపు కార్డుగా నిలుస్తుందని, అర్హులందరికీ తప్పకుండా అందుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, తాహశీల్దార్ వేణుగోపాల్, పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.