|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 02:37 PM
కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంత్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలుడు కరెంట్ షాక్‌కు గురై మృతిచెందాడు. బంధువుతో కలిసి ఇంటి ప్రాంగణంలో షటిల్ ఆడుతుండగా, షటిల్‌కాక్ పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌పై పడింది. దాన్ని బ్యాట్‌తో తీయడానికి ప్రయత్నించగా కరెంట్ షాక్ తగిలి బాలుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.