|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 03:30 PM
తుర్కపల్లి మండలంలోని నాగాయపల్లి, నాగాయపల్లి తండా ప్రజలు బుధవారం ఒక తీర్మానం చేశారు. ఇకపై తమ తండాలో మద్యం అమ్మకాలు అనుమతించబోమని స్పష్టం చేశారు. మద్యం వల్ల కుటుంబాలు ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడుతున్నాయని, మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి, ఏఎస్ఐకి వినతిపత్రం ఇచ్చారు. యువకులు, ప్రజల సమక్షంలో మద్యం షాపులకు బహిరంగంగా నిషేధం ప్రకటించారు.