|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 12:52 PM
ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అర్జీలను పరిశీలించిన ఆయన, వాటి పరిష్కారానికి అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి కూడా పాల్గొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు.