|
|
by Suryaa Desk | Fri, Aug 08, 2025, 11:01 AM
TG: నల్లగొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దేవరకొండలోని బాలవిజయసాయి ఆసుపత్రిలో 4 నెలల బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తూ ఆస్ప్రత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.