|
|
by Suryaa Desk | Fri, Aug 08, 2025, 11:15 AM
TG: హైదరాబాద్‌లో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు హిమాయత్ సాగర్కు వరద నీరు పోటెత్తింది. రిజర్వాయర్ పూర్తిస్థాయికి నీటి మట్టం చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు నాలుగు గేట్లు ఎత్తి దిగువన ఉన్న మూసీలోకి దాదాపు 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అయితే మరో రెండు గేట్లు ఎత్తితే మూసి పరివాహక ప్రాంతాల్లోని వారిని ఖాళీ చేయించే అవకాశం ఉంది. అధికారులు ఇప్పటికే లోతట్టు ప్రాంత వాసులను అధికారులు అప్రమత్తం చేశారు.