|
|
by Suryaa Desk | Sat, Aug 09, 2025, 12:42 PM
జన్నారం మండలంలో శనివారం ఉదయం కుండపోత వర్షం కురిసింది. పట్టణంతో పాటు ధర్మారం, చింతగూడ, టీజిపల్లి, మోర్రిగూడ గ్రామాల్లో భారీ వర్షం నమోదయింది. గత పది రోజులుగా వర్షం లేక ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు, రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా రైతులు పంటలకు ప్రాణం పోసినట్లు ఉందని ఆనందం వ్యక్తం చేశారు.