|
|
by Suryaa Desk | Fri, Aug 08, 2025, 11:31 AM
రాడార్ ప్రజలకు ఉపయోగపడుతోందా..? అయితే వెంటనే వాళ్లకు అందుబాటులో లేకుండా చేయండి. హైదరాబాద్ IMD రాడార్ సంస్థను ప్రజలకు అందుబాటులో లేకుండా చేసిన ప్రభుత్వ యంత్రాంగం. వాతావరణ పరిస్థితులను పర్యవేక్షించడానికి, తుఫానులు, భారీ వర్షాలు వంటి వాతావరణ సంఘటనలను గుర్తించడానికి ఉపయగించే IMD రాడార్‌ను ప్రజలకు అందుబాటులో లేకుండా చేసిన సంస్థ. కేవలం IMD సిబ్బందికి మాత్రమే అందుబాటులో ఉంచాలని నిర్ణయం. భారతదేశంలో మొదటిసారి ఇలా ఒక నగరానికి చెందిన రాడార్‌ను ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడం.. అది కూడా కేవలం హైదరాబాద్ నగరానికి రాడార్ సేవలు ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడంతో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని మండిపడుతున్న పలువురు వెదర్‌మ్యాన్లు అయితే సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో మళ్లీ తిరిగి ప్రజలకు సేవలు అందుబాటులోకి తేవడం గమనార్హం