|
|
by Suryaa Desk | Fri, Aug 08, 2025, 12:25 PM
TG: భారీ వర్షాలకు యాదాద్రి జిల్లా అతలాకుతలమైంది. చౌటుప్పల్ మండలంలో నేలపట్ల వద్ద ఈదుల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అయితే నీటి ఉద్ధృతిని లెక్కచేయకుండా పలువురు కారులో వాగును దాటేందుకు యత్నించారు. దీంతో కారుతో సహా ప్రయాణికులు వాగులో కొద్ది దూరం కొట్టుకుపోయారు. కొద్ది దూరం కొట్టుకెళ్ళాక అది గమనించిన స్థానికులు తాడుతో వారిని కాపాడారు. కారులోని ఏడుగురు ప్రయాణికులు తాడు సాయంతో దిగి సురక్షితంగా ఒడ్డుకు చేరారు.