|
|
by Suryaa Desk | Fri, Aug 08, 2025, 12:58 PM
వర్షాకాలంలో మున్నేరు, ఆకేరు వాగుల వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, 6 జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు చెందిన 75 మంది అధికారులు ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకున్నారు. వీటి ద్వారా వరద ఉద్ధృతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గత ఏడాది వర్షాల నష్టాల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.