|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 10:36 AM
పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో శ్రావణమాస సందర్భంగా భ్రమరాంబ అమ్మవారికి మంగళవారం అర్చకులు, భక్తులు సామూహిక లలిత సహస్ర పారాయణ, కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వీరభద్రయ్య మాట్లాడుతూ శ్రావణమాసంలో భక్తులు స్వామి వారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటారని, భ్రమరాంబ అమ్మవారికి లలిత సహస్ర పారాయణ, కుంకుమార్చనలు భక్తులచే జరిగాయన్నారు.