|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 10:33 AM
AP: ప్రకాశం జిల్లా జే పంగులూరు (M) కొండమంజులూరు గ్రామంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక టెకీ బొప్పుడి మానస (26) ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆమెకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు సంబంధం ఖాయం చేసుకున్నారు. అది మానసకు ఇష్టం లేదు. దీంతో మంగళవారం చీరతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.