|
|
by Suryaa Desk | Fri, Aug 08, 2025, 05:52 PM
భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ధీర్యంగా పోరాడిన ప్రజా యోధుడు పండగ సాయన్న జయంతి కార్యక్రమం శుక్రవారం స్థానిక బీసీ సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు కస్తూరి ప్రభాకర్, కోలా సైదులు, పెద్ది శ్రీనివాస్ గౌడ్ లు పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు.
పండగ సాయన్న అనేది కేవలం ఒక వ్యక్తి పేరు కాదు, అది అట్టడుగు వర్గాల కోసం జరిగిన సుదీర్ఘ ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తుంది అని నేతలు పేర్కొన్నారు. భూమి కేవలం భూస్వాముల హక్కు కాదు, దాన్ని సాగు చేసే రైతన్నల హక్కు కూడా అని ఆయన గళమెత్తి చాటారని చెప్పారు.
అట్టి సాయన్నని హత్య చేయడం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా, ఒక భావజాలాన్ని అణిచివేయాలనే ప్రయత్నంగా గుర్తించాల్సిన అవసరం ఉందని నాయకులు అన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సాయన్న త్యాగం యువతకు స్ఫూర్తిగా నిలవాలి. సమాన హక్కులు, భూహక్కుల కోసం కొనసాగుతున్న పోరాటాలలో ఆయన బాటలోనే పయనించాలన్నారు. వ్యవస్థ పట్ల ప్రశ్నించే ధైర్యాన్ని కలిగి ఉండాలని, అన్యాయానికి ఎదురు నిలవాలనే సందేశాన్ని పండగ సాయన్న జీవితమే చెబుతోందని నేతలు స్పష్టం చేశారు.