|
|
by Suryaa Desk | Thu, Aug 07, 2025, 06:39 PM
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ జన్మదినం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక లేఖ ద్వారా అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు గురువారం తెలిపారు. షేట్కార్ కు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, శాంతి, శ్రేయస్సు కలగాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. రాష్ట్రపతి నుండి లేఖ రావడం జహీరాబాద్ ప్రజలకు గర్వకారణమని, ఇది తమకు గౌరవదాయకమైన సంఘటనగా భావిస్తున్నట్లు తెలిపారు.