|
|
by Suryaa Desk | Thu, Aug 07, 2025, 06:32 PM
అందోల్, మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని కాయిదంపల్లి గ్రామంలోని రెండు అంగన్వాడీ కేంద్రాలలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. పుట్టిన బిడ్డకు ముర్రిపాలు తాగించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగమణి సూచించారు. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు శ్రేష్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు, సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.