|
|
by Suryaa Desk | Thu, Aug 07, 2025, 03:19 PM
హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ అభివృద్ధి చేసిన కందుల పంట కొత్త వంగడమైన ‘ఐసీపీవీ 25444’ను ఇటీవల ఆవిష్కరించారు. ఇది కేవలం 120 రోజుల్లోనే దిగుబడినిస్తుంది. ఏడాదిలో మూడు పంటలు పండించుకునే అవకాశం, 45 డిగ్రీల ఉష్ణోగ్రతలను తట్టుకోవడం దీనిలో ప్రత్యేకత. ఇది ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కేవలం 2 కిలోల విత్తనాలు ఒక ఎకరానికి సరిపోతాయని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలో పరీక్షలు విజయవంతమయ్యాయి.