|
|
by Suryaa Desk | Fri, Aug 08, 2025, 03:12 PM
TG: గత ప్రభుత్వంలో భారీగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సిట్ విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్, హరీశ్ రావు ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. మునుగోడు ఉపఎన్నిక సమయంలో నా ఫోన్ ట్యాప్ చేశారు. ఎమ్మెల్యేలు, అధికారులు, హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. అధికారులు చూపించిన వివరాలు చూసి షాక్ అయ్యాను. కేసీఆర్ ఫ్యామిలీ క్రూరమైన ఆలోచన చేసింది' అని అన్నారు.