|
|
by Suryaa Desk | Fri, Aug 08, 2025, 02:38 PM
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముద్దసాని అఖిల (22) అనే నవ వధువు దుర్మరణం చెందింది. మూడు రోజుల క్రితమే వివాహమైన అఖిల, పీజీ సెట్ ఎంట్రన్స్ పరీక్ష రాసి తిరిగి కరీంనగర్ వెళ్తుండగా, రాజీవ్ రహదారిపై ఆమె ప్రయాణిస్తున్న బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అఖిల అక్కడికక్కడే మృతి చెందింది.