|
|
by Suryaa Desk | Fri, Aug 08, 2025, 08:40 PM
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. పదవులు ఇవ్వలేదని అలిగేవాడు కార్యకర్త కాదని బాలరాజుకు చురకలంటించారు. తాను ఎప్పుడూ పదవుల కోసం పాకులాడలేదని చెప్పారు. తనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పదవి ఇస్తానని రేవంత్ రెడ్డి ఓ వేదికపై చెప్పారని కానీ తాను పదవులకు ఆశ పడలేదని కేసీఆర్ కు మాట ఇచ్చానని అధికారం ఉన్నా లేకున్నా కేసీఆర్ వెంటే నడుస్తానని అన్నారు. అచ్చంపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.తాను బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ కూడా అడగలేదని ఆ విషయం గువ్వల బాలరాజుకు కూడా తెలుసని చెప్పారు. తనకు కాదని నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ప్రవీణ్ కుమార్ కు ఇచ్చారని బాలరాజు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారని ఎంపీ కావాలని తాను బీఆర్ఎస్ లోకి రాలేదని చెప్పారు. ఏడు సంవత్సరాల ఐపీఎస్ సర్వీస్ ఉండగానే తాను ఉద్యోగాన్ని వదిలేశానని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో తన మిత్రులు డీజీపీలుగా ఉన్నారని సర్వీసులో ఉంటే తనకు కూడా డీజీపీ హోదా వచ్చేదని చెప్పారు. డీజీపీ అయితే తనకే లాభమని కానీ, బలహీన వర్గాల ప్రజల కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు.