|
|
by Suryaa Desk | Thu, Aug 07, 2025, 02:11 PM
హైదరాబాద్ మధురానగర్‌లో హాస్టల్‌లో ఉంటున్న బాపట్లకు చెందిన 24 ఏళ్ల యువతి, ప్రేమ పేరుతో మోసపోయింది. యువతి దూరపు బంధువు గోపి(24) ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి భర్తకు విడాకులివ్వాలని ఒత్తిడి తీసుకువచ్చాడు. దీంతో ఆమె భర్తకు విడాకులు ఇచ్చింది. అయితే గర్భవతిని చేసి గోపి ముఖం చాటేయగా, మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలుసుకున్న బాధితురాలు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.