|
|
by Suryaa Desk | Thu, Aug 07, 2025, 02:02 PM
TG: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. 'స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయడానికి పది రోజులు చాలు. కోర్టు తీర్పు మేరకు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తాం. 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ కమిట్మెంట్ నిరూపించుకున్నాం. మా చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరు. మా పోరాటం కేంద్రంపై కాబట్టి జంతర్ మంతర్ వద్ద మా గొంతు వినిపించాం. కేసీఆర్ ఆర్డినెన్స్ తెచ్చారు కాబట్టి సవరించిన ముసాయిదా గవర్నర్ కి పంపాం. మోదీ చేతుల్లోనే బీసీ రిజర్వేషన్ నిర్ణయం ఉంది' అని అన్నారు.