|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 11:41 AM
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం శమ్నాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రామాయంపేట నుంచి మెదక్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ పాఠశాల బస్, ఎదురుగా వస్తున్న కారు, ద్విచక్ర వాహనం మూడు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. పాఠశాల బస్సులో ఉన్న విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది.