|
|
by Suryaa Desk | Fri, Aug 08, 2025, 02:11 PM
కామారెడ్డిలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా, మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వందలాది మహిళలు భారీ కలశాల యాత్ర నిర్వహించారు. పెద్ద బజార్‌లోని హనుమాన్ మందిరం నుండి వీక్లీ మార్కెట్‌లోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం వరకు అలంకరించిన కలశాలతో ఊరేగింపుగా వెళ్లిన మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. సీఐ నరహరి, ఎస్సై వినయ్ సాగర్ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు కల్పించారు. సంఘం ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.