|
|
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 10:30 AM
ఖమ్మం నగరంలోని దానవాయిగూడెం డంపింగ్ యార్డ్ ను కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య గురువారం సందర్శించి బయోమైనింగ్ కార్యకలాపాలను నేరుగా జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. సుస్థిర ఘన వ్యర్ధాల నిర్వహణలో భాగంగా సీడీఎంఏ లైవ్ జూమ్ సమావేశంలో పాల్గొని, స్థలంలో జరుగుతున్న బయోమైనింగ్ కార్యకలాపాలను వివరించారు. వాకీటాకీ వంటి సాంకేతిక పరికరాలతో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు వీలుంటుందన్నారు.