![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 10:34 AM
కొద్దిరోజులుగా స్వల్పంగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు శుక్రవారం పెరిగాయి. హైదరాబాద్ నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,200 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,400 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 73,800 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,410 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,210 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 73,810 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.