![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 10:46 AM
టెలిగ్రామ్ వల్ల నేను మోసపోయినట్టు ఎవరూ మోసపోకండి. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి, సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్న యువతి . వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇప్పిస్తామని టెలిగ్రామ్ లో మెసేజ్ చేసి యువతి వద్ద లక్ష రూపాయలు వసూలు చేసిన సైబర్ నేరగాళ్లు. పశ్చిమ గోదావరి జిల్లా కంచుస్తంభం పాలెం గ్రామానికి చెందిన అనూష అనే యువతికి వెంకన్న బాబు అనే వ్యక్తితో ఐదేళ్ల క్రితం వివాహం జరగగా, హైదరాబాద్ కేపీహెచ్‌బీలో నివాసం ఉంటున్న దంపతులు . ఇటీవల టెలిగ్రామ్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇప్పిస్తామని మెసేజ్ రావడంతో రూ.1000 చెల్లించిన అనూష . రూ.1000 చెల్లిస్తే రూ.7000 లాభం వచ్చిందని మెసేజ్ రావడంతో, తనకు వచ్చిన లాభాన్ని తన బ్యాంకు ఖాతాలో జమ చేయమని సైబర్ నేరగాళ్లని కోరిన అనూష. మీ లాభాన్ని పొందాలంటే మరింత డబ్బు జమ చేయాలని సైబర్ నేరగాళ్లు చెప్పిన మాటలు నమ్మి, విడతల వారిగా తన బంగారాన్ని అమ్మి రూ.1 లక్ష వరకు చెల్లించిన అనూష . ఎన్ని సార్లు ప్రయత్నించిన వారి నుండి స్పందన లేకపోవడంతో, మోసపోయానని గ్రహించి తీవ్ర ఆందోళనకు గురైన అనూష. డబ్బులు పోయాయని బాధలో, తన లాగా ఇంకొకరు టెలిగ్రామ్ యాప్ వల్ల మోసపోకూడదని సూసైడ్ లెటర్ రాసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న అనూష . అనూష భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు