![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 10:56 AM
పేదలకు సీఎం సహాయనిధి ఆపత్కాలంలో అండగా నిలిచి ఆదుకుంటుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.మంగళవారం పటాన్ చెరు నియోజకవర్గానికి చెందిన నలుగురు లబ్ధిదారులు గుమ్మడిదల మున్సిపాలిటీ, మండలం - కానుకుంట - ఎల్లబోయిన రాములు (₹1,04,000/-), అన్నారం - చింతగడ్డి సువర్ణ (55,000/-), మంబాపూర్ - కంజర్ల శ్రీనివాస్ (60,000/-) పటాన్ చెరు మండలం రుద్రారం - పి. శమంతా 1,09,000/- మొత్తం ₹3,28,000/- విలువగల సీఎం రిలీఫ్ ఫండ్(CMRF) చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని, అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు CMRF ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తు వెయ్యి కోట్లకు పైగా నిధులను CMRF కొరకు వెచ్చించదని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.