![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 11:17 AM
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచాలన్న సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు జలమండలి ఆధ్వర్యంలో హిమాయత్ సాగర్ జలమండలి పార్క్లో గురువారం రోజున వన మహోత్సవం-2025 కార్యక్రమాన్ని చేపట్టింది.జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ ఆధ్వర్యంలో ప్రత్యేక మొక్కలు నాటే కార్యక్రమంలో జలమండలి డైరెక్టర్లు, అధికారులు కలిసి దాదాపు 200ల మొక్కలు నాటారు. హిమాయత్ సాగర్ రిజర్వాయర్ సమీపంలోని జలమండలి పార్క్ లో.. ఎకరం స్థలంలో పనస, మామిడి, శ్రీగంధం, నేరేడు వంటి మొక్కలను నాటారు. అలాగే ఇక్కడే 35 రకాల తామర, లిల్లీ జాతుల మొక్కలను ప్రత్యేకంగా పెంచుతూ సంరక్షిస్తున్నట్లు ఎండీకి అధికారులు తెలిపారు.ఇంతకుముందు గ్రీన్ హౌస్ ను ప్రారంభించిన ఎండీ అక్కడి మొక్కలను పరిశీలించారు. ఈ గ్రీన్ హౌస్ లో ఎండవేడిమికి తట్టుకోలేని ఇండోర్, ఆక్సిజన్ మొక్కలైన ఆంగ్లోనియం, క్యాలోతియం, సింగోనియం, స్నేక్ ప్లాంట్స్ లాంటి రకాలను దాదాపు 70 వెరైటీ మొక్కలను పెంచుతూ జలమండలి అధికార కార్యాలయాలలో అలంకరణకోసం ఉపయోగిస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు ఎండీకి వివరించారు.ఈ కార్యక్రమంలో ఈఎన్సీ డైరెక్టర్ ఆపరేషన్-2 వి.ఎల్ ప్రవీణ్కుమార్, ప్రాజెక్ట్ డైరెక్టర్లు సుదర్శన్, టీవీ శ్రీధర్, ఆపరేషన్ డైరెక్టర్-1 అమరేందర్రెడ్డి, పర్స్నల్ డైరెక్టర్ ముహమ్మద్ అబ్దుల్ ఖాదర్, ఫైనాన్స్ డైరెక్టర్ పద్మావతి, సీజీఎం బ్రిజేష్, ఈఓ విజయకుమారి, జలమండలి డీసీఎఫ్ వెంకటేశ్వర్లు, ఆర్.ఎఫ్.ఓ నారాయణరావు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లతోపాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.