|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 02:50 PM
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగియడంతో.. ఇప్పుడు అందరి దృష్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై పడింది. అయితే ఇప్పట్లో MPTC, ZPTC ఎన్నికలు జరగేలా కనిపించడం లేదు. ఓటర్ల సమగ్ర సవరణ జాబితా సిద్దం చేయాల్సి ఉండటం వల్ల ఈ ఎన్నికల నిర్వహణ ఆలస్యమవుతోంది. వచ్చే ఏడాది జనవరి తొలి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం సమగ్ర సవరణ జాబితా విడుదల చేసే అవకాశముంది. ఈ జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని SEC భావిస్తోంది. ఫిబ్రవరి లేదా ఆ తర్వాతి నెలలో ఈ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది.