|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 03:24 PM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మత విద్వేషాన్ని రెచ్చగొట్టేవారిపై కర్ణాటక తరహాలోనే కఠిన చట్టం తీసుకొస్తామని ప్రకటించారు. కర్ణాటకలో 'ది కర్ణాటక హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్, 2025' పేరుతో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం, మతం, కులం, భాష, లింగం వంటి వాటి ఆధారంగా ద్వేషాన్ని కలిగించే బహిరంగ వ్యక్తీకరణను ద్వేషపూరిత ప్రసంగంగా పరిగణిస్తారు. అయితే, ఈ బిల్లు భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని, దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని విమర్శలు వస్తున్నాయి.