|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 03:11 PM
కొత్తగూడెం, సుజాత నగర్ మండలం లో భాగం నారాయణ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులైన కొత్త అంజినాపురం మాజీ ఉపసర్పంచ్, సీపీఐ సీనియర్ నాయకులు భాగం కృష్ణ గారి తండ్రిగారు భాగం నారాయణ గారి పెద్దకర్మ కొత్తగూడెం క్లబ్ లో జరిగింది. సుజాతనగర్ సీపీఐ మండల పార్టీ ఆధ్వర్యంలో వెళ్లి భాగం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, భాగం నారాయణ గారి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సుజాతనగర్ సీపీఐ మండల కార్యదర్శి కోమారి హనుమంతరావు, జిల్లా కౌన్సిల్ సభ్యులు జక్కుల రాములు, మండల సహాయ కార్యదర్శి తాళ్లూరి ధర్మారావు, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు వీర్ల మల్లేష్, దుర్గాప్రసాద్, మేకల వెంకటేష్, భూక్య శ్రీను, కుమారి కృష్ణ, గడ్డం రాజేందర్, రాజేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు