![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 12:10 PM
రాచకొండ_కమిషనర్ జి. సుదీర్ బాబు గారు తలపెట్టిన విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ప్రజలలో సైబర్ నేరాల పట్ల అవగాహన కోసం సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహనా మరియు అప్రమత్తత" గురించి ప్రతిరోజు ప్రజలు ఎక్కువగా గుమికూడి ఉన్న ప్రదేశాలలో ఎల్ బి నగర్ పోలీస్ వారు ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండటం ద్వారా సైబర్ నేరస్తులు పన్నే వలలో పడకుండా ఏ విధంగా మనల్ని మనం కాపాడుకోవచ్చు మరియు లోన్ యాప్లు సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే లింకులను తెరవడం ద్వారా మనకు జరిగే నష్టం, మనల్ని భయాందోళనకు గురిచేసి మన యొక్క బలహీనతలను ఏ విధంగా నేరస్తులు ఒక అవకాశం గా మలచుకుంటారో తెలియపరుస్తూ అద్భుతంగా అవగాహన కల్పిస్తున్న ఎల్బీనగర్ పోలీస్ వారిని రాచకొండ కమిషనర్ గారు ప్రశంసించడం జరిగింది. ఇందులో భాగంగా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ నందు నూతనంగా ఎంపికైన వైష్ణవి అనే మహిళా కానిస్టేబుల్ ని ఎల్బీనగర్ లోని తన క్యాంప్ కార్యాలయమునకు పిలిపించుకొని సిపి ఆమెకు రివార్డు అందజేయడం జరిగింది. అనురాగ్ యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేసుకుని 2024 బ్యాచ్ లో కానిస్టేబుల్ గా భర్తీ ఐ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా మేము చేయగలం అని నిరూపిస్తున్నారు.