![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 03:43 PM
నీళ్లు వదిలిపెట్టి తెలంగాణకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని BRS నేత హరీశ్ రావు ఆరోపించారు. 299:512 శాశ్వత ఒప్పందం చేసుకున్నారని పదే పదే అబద్ధం చెప్పడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. తాత్కాలిక నీటి వినియోగం, నీటి పంపకానికి తేడా తెలియకుండా రేవంత్ మాట్లాడుతున్నాడని విమర్శించారు. నీటి వినియోగం KRMB చేస్తుందని, నీటి పంపకం ట్రిబ్యూనల్ చేస్తుందని తెలిపారు. నీటి వినియోగం ఆ ఏడాదికి మాత్రమే పరిమితమని, నీటి పంపకం శాశ్వతమైందన్నారు.