![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 03:42 PM
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు వెనుక ఖర్గే, రాహల్ గాంధీ ఆశయం ఉందన్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్. సామాజిక న్యాయం కాంగ్రెస్‌లోనే సాధ్యమని మరోసారి నిరూపితమైందని చెప్పారు. ‘బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఏం సంబంధం? మేం చేసిన దానికి ఆమె క్రెడిట్ తీసుకోవడమేంటి? కవితను చూసి జనాలు నవ్వుకుంటున్నారు. కేసీఆర్ పదేళ్లు ఏం చేశారని ఆమె బీసీ పాట పాడుతున్నారు’ అని తెలిపారు.