![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 03:40 PM
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు వెనుక ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉన్నదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టంచేశారు. ఈ ప్రగతిశీల నిర్ణయానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆశయమే మూలమని ఆయన తెలిపారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ చేస్తున్న కృషి ఈ నిర్ణయంతో మళ్లీ రుజువైంది అన్నారు.
బీసీ రిజర్వేషన్ల విషయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన ఖాతాలో వేసుకోవడం అర్థరహితమని మహేశ్‌కుమార్ విమర్శించారు. “మేం చేసిన దానికి ఆమె క్రెడిట్ తీసుకోవడమేంటి? నిజానికి ఆమెకు ఈ నిర్ణయంతో ఏమాత్రం సంబంధం లేదు. ఇది పూర్తిగా కాంగ్రెస్ పోరాట ఫలితం” అని ఆయన అన్నారు.
కవిత బీసీల కోసం పాటలు పాడడం ప్రజల్లో నవ్వులు పుట్టిస్తోందని విమర్శించారు. “కేసీఆర్ పదేళ్లు పాలనలో ఉన్నప్పుడు బీసీల కోసం ఏం చేశారు? ఇప్పుడు మాత్రం కవిత బీసీల పేరుతో మళ్లీ రాజకీయ లాభం కోరి వినిపిస్తున్నారు” అంటూ మండిపడ్డారు మహేశ్‌కుమార్ గౌడ్.