![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 03:45 PM
దేవరకొండ పట్టణంలో ఎమ్మెల్యే బాలునాయక్ శుక్రవారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. రాష్ట్ర క్యాబినెట్ 42 శాతం బీసీ రిజర్వేషన్లను ఆమోదిస్తూ గురువారం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, తమ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు.