![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 02:45 PM
కల్తీ కల్లు కట్టడికి చర్యలు తీసుకోవాలని BRS MLC దాసోజు శ్రవణ్ అన్నారు. 'HYD నడిబొడ్డున కల్తీ కల్లుతో ఏడుగురు మరణించారు. CM రేవంత్ దగ్గరే హోం శాఖ ఉంది. ఈ శాఖ భాద్యతారాహిత్యాన్నిపార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. కల్తీ కల్లు బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. ఈ కల్లు దుకాణాలు నడుపుతున్న వారు కాంగ్రెస్ నేతలనే సమాచారం ఉంది. వారు ఏ పార్టీ అని చూడకుండా కఠిన చర్యలు తీసుకోవాలి' అని డిమాండ్ చేశారు.