![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 02:49 PM
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ లో 4 కోట్లతో యాదవ సంఘం కళ్యాణ మండపం పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం గోకుల్ నగర్ లో నిర్మిస్తున్న కళ్యాణ మండపాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, యాదవ సంఘం ప్రతినిధులతో సమావేశమయ్యారు.