![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 04:18 PM
చేనేత కార్మికులకు సంబంధించిన వ్యక్తిగత రుణాల వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అధికారులను ఆదేశించారు. అలాగే లబ్ధిదారుల ఖాతాలలో రుణమాఫీ నిధులు వెంటనే జమ చేయాలన్నారు. హైదరాబాద్‌లో గురువారం చేనేత జౌళిశాఖ అధికారులతో తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పోరేషన్ల నుంచి ఏడాదికి అవసరమైన వస్త్రాల కోసం సెప్టెంబర్ నెలలోనే ఆర్డర్లు తెప్పించుకోవాలన్నారు.