![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 04:13 PM
దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో ఒకే ఒక్క డెంగ్యూ కేసు నమోదైనా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి హెచ్చరించారు. శుక్రవారం ఆయన మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అకస్మాత్తుగా సందర్శించి అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.
ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. వైద్య సౌకర్యాలు, శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రజలు డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
వైద్య సిబ్బందితో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతి రోజూ ఓపీకి ఎంతమంది రోగులు వస్తున్నారన్న అంశాన్ని డాక్టర్ శరత్ చంద్రతో అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అవసరమైన సదుపాయాల గురించి అధికారులతో చర్చించి, అవసరమైనచోట కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు.