![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 04:11 PM
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను జేపీ నడ్డా ఆమోదించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై రాజాసింగ్ స్పందించారు. ‘11 ఏళ్ల కింద బీజేపీలో చేరా. నన్ను నమ్మి పార్టీ మూడుసార్లు టికెట్ ఇచ్చింది. ఇన్నిరోజులు నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. నా చివరి శ్వాస వరకు హిందుత్వం, సనాతన ధర్మం, జాతీయవాదం కోసం పనిచేస్తా’ అని రాజాసింగ్ తెలిపారు.